క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట
ఎంపీ సురేష్ షెట్కార్
జహీరాబాద్ టౌన్: క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం పట్టణంలోని పస్తాపూర్ వద్ద గల ఫంక్షన్‌హాలులో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజౖరైన జహీరాబాద్ ఎంపీ.సురేష్ షెట్కార్ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజవకర్గంలోని 50 చర్చిల మరమ్మతులకు రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో భవనాలకు రంగులు వేయడం, డిజిటల్ లైటింగ్, అలంకరణ తదితర పనులు చేపడుతారన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ దేవూజా, తహసీల్దార్ దశరథ్, కోహీర్ తహసీల్దార్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.


