క్రిస్మస్ సందడి
జిల్లా కేంద్రంలో ముందస్తు క్రిస్మస్ సందడి నెలకొంది. సంగారెడ్డి పట్టణంలోని చర్చిలన్నీ ఇప్పటికే విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి. హాయ్ అంటూ పిల్లలకు గిఫ్ట్‌లు అందించే క్రిస్మస్ తాత(శాంతాక్లాజ్) బొమ్మలకు, మార్కెట్లో ట్రీకి, వివిధ రకాల స్టార్లు, బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. క్రిస్మస్ ట్రీ రూ.500 నుంచి రూ.3,000కు పైగా వరకు ధరలు ఉన్నాయి. వివిధ రకాల స్టార్లకు వాటి సైజ్‌ను బట్టి రూ.1,000 నుంచి 5,000 పైగా ధరలు ఉన్నాయి. పట్టణంలో ఎటు చూసినా క్రిస్మస్ సంబంధిత వస్తువుల కొనుగోలుదారులతో సందండిగా మారింది. – సంగారెడ్డి క్రైమ్


