సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Dec 29 2025 10:56 AM | Updated on Dec 29 2025 10:56 AM

సమస్య

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

పెద్దశంకరంపేట(మెదక్‌): నూతన సర్పంచ్‌లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దశంకరంపేట మండలంలో ఇటీవల నూతనంగా గెలిచిన పలువురు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అధ్వర్యంలో హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా ఆయన నూతన ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, నాయకులు సురేశ్‌గౌడ్‌, సత్యనారాయ ణ, అంజయ్య, రవీందర్‌, కృష్ణ, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.

స్టాండింగ్‌ కౌన్సిల్‌

సభ్యుడిగా మారుతిరెడ్డి

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది మారుతిరెడ్డిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖతో పాటు తన నియామకానికి కృషి చేసిన వారికి మారుతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలి

సంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పా ల్గొని మాట్లాడారు. పర్మనెంట్‌ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. న్యాయబద్ధమైన ఉద్యమానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జిల్లా అవుట్‌ సో ర్సింగ్‌ జేఏసీ అధ్యక్షుడు ప్రకాశ్‌నాయక్‌ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయా ల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరూ ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం జిల్లా జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

మనోహరాబాద్‌(తూప్రాన్‌): వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివా రం మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన పలు పార్టీల నాయకులు సుమారు 50 మంది బీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, నాయకులు వెంకటేశ్‌గౌడ్‌, పాలాట సర్పంచ్‌ సాయిగౌడ్‌, సీనియర్‌ నాయకులు పురం మహేశ్‌, అర్జున్‌, భిక్షపతి, కుమార్‌గౌడ్‌, నాగభూషణం, పర్శరాంగౌడ్‌, కృష్ణగౌడ్‌, సాయి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల కోసం పోరాటం: సీఐటీయూ

పటాన్‌చెరు టౌన్‌: ఐక్య పోరాటాల సారధి సీఐటీయూ అని సంఘం జిల్లా కోశాధికారి రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్‌లో జరిగిన సీఐటీయూ కా ర్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఈనెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు శేషగిరి, త్రిమూర్తులు, జయకుమార్‌, చంద్రకిరణ్‌ సింగ్‌, శ్రీనివాస్‌, నారాయణ, రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
1
1/2

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
2
2/2

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement