మహాత్మాగాంధీ పేరు తొలగించడం సరికాదు
పటాన్‌చెరు టౌన్: వలసల నివారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే, కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించడం సబబు కాదని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి మండిపడ్డారు. అదిష్టానం పిలుపు మేరకు ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారిపై నూతన చట్టం ప్రతులను తగల బెడుతూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ గారి పేరు తొలగింపుపై కాంగ్రెస్ పోరాడితే బీజేపీ మత ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, కాంగ్రెస్ నాయకులు సాయిలు ముదిరాజ్, యువరాజ్, జ్యోతిలక్ష్మి, శ్రీలేఖ, రతన్ సింగ్, ప్రభాకర్, రమేశ్, శ్రీనివాస్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


