ఈ ఏడాది 41 హత్యలు..
జిల్లాలో గత ఏడాది 60 హత్యలు జరగగా ఈ ఏడాది 41 జరిగాయి. కిడ్నాప్‌లు గత ఏడాది 90 కేసులు నమోదు కాగా ఈ ఏడాదికి 125కు పెరిగాయి. కిడ్నాప్ కేసులు పెరగటం ఆందోళన కలిగించే అంశం. ఆవేశం, అత్యాశ, అనుమానంతో జిల్లాలో ఈ ఏడాది క్షణికావేశంలో దారుణ హత్యాఘటనలు చోటు చేసుకున్నాయి.
248 ఇసుక అక్రమ రవాణా కేసులు
గత రెండేళ్లుగా అక్రమ ఇసుక రవాణా కేసుల సంఖ్య పెరుగుతుంది. 2023లో 23, 2024లో 45, 2025లో 248 కేసులు నమోదయ్యాయి. గతంలో కంటే మూడింతల మేర కేసులు నమోదు అవుతున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు.
490 సైబర్ క్రైమ్..
ఈ ఏడాది 490 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రూ.34.64 కోట్లు కోల్పోగా బాధితుల ఫిర్యాదులతో రూ.7.03 కోట్ల హోల్డ్ చేశారు. 1264 పేకాట కేసులలో ఈ ఏడాది రూ.78,46,693 సీజ్ చేశారు. గతేడాది కంటే ఏడాది సైబర్ కేసులు తగ్గగా పేకాట కేసులు మాత్రం పెరిగాయి.
పెరిగిన గంజాయి కేసులు
గతేడాది 34 కేసులు నమోదు కాగా 508.71 కేజీల గంజాయిని సీజ్ చేసి 79 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడాది 43 కేసులలో 786.635 కేజీల గంజాయిని సీజ్ చేసి, 88 మందిని అరెస్టు చేశారు.
రోడ్డు ప్రమాదాలు, మరణాలు
గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాల సంఖ్య తగ్గింది. జరిగిన ప్రమాదాల్లో పలు చోట్ల కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందటంతో వారి బంధువులు, గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గతేడాది 958 రోడ్డు ప్రమాదాల్లో 433 మంది మృత్యువాత పడగా, 1011 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ఏడాది 917 రోడ్డు ప్రమాదాల్లో 423 మంది మృత్యువాత పడ్డారు. 895 మంది గాయాలపాలయ్యారు.
ఈ ఏడాది 41 హత్యలు..


