మంజీరా పైపులైన్ లీకేజీ..
శివ్వంపేట(నర్సాపూర్): మంజీర ప్రధాన పైపులైన్ నీటి లీకేజీతో బస్టాండ్ ప్రాంగణం చిత్తడిగా మారింది. తూప్రాన్– నర్సాపూర్ హైవేకు ఆనుకొని ఉన్న మండల కేంద్రమైన శివ్వంపేట బస్టాండ్ వద్ద మంజీర ప్రధాన పైపులైన్ నుంచి నీరు లీక్ అవుతుంది. దీంతో నీటితో చిత్తడిగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయం గురించి మంజీర నీటి సరఫరా ఏఈ సురేశ్‌ను వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
చిత్తడిగా మారిన బస్టాండ్


