ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ సర్కిల్ పరిధిలోని బీమ్యాక్ సొసైటీ కాలసీవాసులతో జలమండలి ఎండి అశోక్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీమ్యాక్ కాలనీవాసులు తాగునీటి కనెక్షన్ల కోసం జలమండలి అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అందుకు అధికారులు రూ.3.8కోట్ల చెల్లించాలని, ఇందులో రూ.86లక్షలు ఇంవ్రూవ్మెంట్ చార్జీలు కట్టాలని నోటీసులు ఇచ్చారన్నారు. దీంతో ఎండిని కలిసి చార్జీలు తగ్గించాలని కోరామని తెలిపారు. ఇందుకు సబంధించిన రూ.3కోట్ల డీడీని అందజేశామన్నారు.


