23న నల్లవాగు నీరు విడుదల
● చివరి ఆయకట్టు వరకు నీరందిస్తా ● ఎమ్మెల్యే సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణకేడ్): జిల్లాలోని మధ్యతరహ ప్రాజెక్టు నల్లవాగు కింద యాసంగి పంటల సాగుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పేర్కొన్నారు. శనివారం సిర్గాపూర్ మండలం సల్తానాబాద్ వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. మార్డి, ఇందిరానగర్, కల్హేర్ వరకు నీటి సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రైతులు కాల్వల్లో మోటార్లు పెట్టొదని చెప్పారు. నీటి వాడకంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ సుందర్, డీఈఈలు ఆహ్మద్, జలంధర్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహరెడ్డి, మాజీ ఆత్మచైర్మన్ గుండు నరేందర్, ఎఈలు శ్రీవర్ధన్‌రెడ్డి, మల్లేశం, సర్పంచ్ గోవింద్‌నాయక్, నాయకులు పాల్గొన్నారు.


