అవార్డు కోసం కృషి
స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. జాతీయస్థాయికి కూడా ఎంపికయ్యేలా కృషి చేయాలని ఆయా పాఠశాలల కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, పాఠశాలల హెచ్‌ఎంలకు సూచించాం.
– వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి
రూ. లక్ష ప్రోత్సాహం
జిల్లాలో అధిక రేగింగ్ కలిగి పాఠశాలలను ఇటీవల జిల్లా బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. అందులో అన్ని అర్హతలు కలిగిన ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది. జహీరాబాద్ మండల పరిధిలోని గోవింద్‌పూర్, కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలు, అలాగే పటాన్‌చెరులోని శిశు విహార్, పలు ప్రైవేట్ పాఠశాలలు ఎంపికై న వాటిలో ఉన్నాయి. త్వరలో రాష్ట్ర బృందం వీటిని పరిశీలించనుంది. రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేసి వాటికి రూ.లక్ష స్కూల్ గ్రాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది.


