ఖైదీలకు సరైన ఆహారాన్ని అందించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర
సంగారెడ్డి టౌన్: జైలులో ఖైదీలకు సరైన ఆహారాన్ని అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. శనివారం కంది లోని సెంట్రల్ జైలును తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైలులోని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. అనంతరం వంటగది, భోజనశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.
పుస్తకపఠనంపై దృష్టి పెట్టాలి
సివిల్ జడ్జి అసదుల్లా షరీఫ్
జోగిపేట(అందోల్): విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగం తగ్గించి.. పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని జోగిపేట జూనియర్ సివిల్ జడ్జి, మండల సర్వీస్ కమిటీ చైర్మన్ మహ్మద్ అసదుల్లా షరీఫ్ పేర్కొన్నారు. శనివారం మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జోగిపేటలోని తెలంగాణ మైనారిటీస్ పాఠశాల, కళాశాలలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. జడ్జి షరీఫ్ మాట్లాడారు. విద్యార్థులకు చట్టాలపై ప్రాథమిక అవగాహన, ఆన్‌న్‌లైన్ మోసాలపై వివరించారు. అనవసర లింకులు ఫేక్ మెసేజ్‌లు నుంచి దూరంగా ఉండాలని సూచించారు. బాలల హక్కులు, విద్యహక్కు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్. శివప్రసాద్, సారా వెంకటేశం, జోగిపేట్ ఏఎస్‌ఐ అంజయ్య, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, లీగల్ సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు.
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ
మునిపల్లి(అందోల్): భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె శనివారం సందర్శించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ సేవ ద్వారా భూ భారతికి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన నివేదిక తయారు చేయాలన్నారు. పూర్తి స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగాభవానీ, ఆర్‌ఐ, సుభాష్, గ్రామ పాలన అధికారులు అంజన్ కుమార్, చంద్ర ప్రకాష్, నర్సింలు, శివగౌడ్, ధనుంజయలు పాల్గొన్నారు.
వంటకాల ప్రదర్శన
ఉత్సాహంగా ఫుడ్ ఫెస్టివల్
ఝరాసంగం(జహీరాబాద్): మండలంలోని బర్దిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్‌ను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకొన్నారు. శనివారం పాఠశాల విద్యార్థులు ఘుమఘుమలాడే వంటకాలను ఇంటి నుంచే తయారు చేసుకుని వచ్చి, ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. వివిధ రకాల వంటలు వాటిని ఆహారంగా తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులు వివరించారు. పలు రకాల వంటకాలను గుర్తించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణప్రియ, ఉపాధ్యాయులు జీవన్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఖైదీలకు సరైన ఆహారాన్ని అందించాలి
ఖైదీలకు సరైన ఆహారాన్ని అందించాలి


