పాఠశాలల తనిఖీ
జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలంలోని పలు పాఠశాలలను శనివారం తనిఖీ కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా రాయిపల్లి తండా, మన్నాపూర్ ప్రాథమిక పాఠశాలలను నోడల్ అధికారి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిమ్మల కిష్టయ్య, వాహబోద్దీన్‌లు తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, బోధన ప్రణాళిక, విద్యార్థుల హాజరు శాతం వంటి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు.
ఇన్‌చార్జి మంత్రిని కలిసిన కార్పొరేటర్
పటాన్‌చెరు టౌన్: స్థానిక డివిజన్‌లో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరయ్యాయని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం నిధుల మంజూరు పత్రంపై సంతకం చేయించేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామిని హైదరాబాద్‌లో కలిశారు. గ్రేటర్‌కు మంజూరైన నిధుల్లో ఒక కోటి నిధులు ఖర్చు చేసేందుకు సంతకం తీసుకున్నట్లు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్, నవీన్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు.


