బాధిత రైతులకు న్యాయం చేయండి
జిన్నారం(పటాన్‌చెరు): భూములు నష్టపోతున్న రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం గుమ్మడిదల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ సమస్యను హరీశ్‌రావుకు విన్నవించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ 109లోని రైతుల భూములపై కొనసాగుతున్న వివాదంలో రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అలాగే, హరీశ్‌రావు దోమడుగు గ్రామస్తులు పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువుల ర్యాలీలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు


