● మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోఅందుబాటులోకి ‘క్రిటికల్ కే
ప్రారంభం కాని సింగూరుకాల్వల ఆధునీకరణ పనులు శంకుస్థాపనలకే పరిమితమైనయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
సింగూరు ప్రాజెక్టు ప్రధాన కాలువల ఆధునీకరణ పనులు ప్రారంభం కాలేదు. ఈ పనుల కోసం ఈ ఏడాది రూ.162 కోట్లు మంజూరైనప్పటికీ.. పనులు మాత్రం పట్టాలెక్కలేదు. ఈ పనులు పూర్తయితే తమ భూములకు సాగునీరు అందుతుందని చివరి ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రైతుల ఆశలు నెరవేరే దిశగా పనులు ప్రారంభం కాకపోవడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఈ ఏడాది పలు కీలక అభివృద్ధి పనులకు అడుగులు పడ్డాయి. రాష్ట్రాభివృద్దికి గేమ్ చేంజర్‌గా భావిస్తున్న ట్రిబుల్‌ఆర్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఈ ఏడాది కొలిక్కి వచ్చింది. ముంబై హైవే విస్తరణ పనుల ప్రగతి వేగం పుంజుకుంది. మెడికల్ కాలేజీకి అనుబంధ ప్రభుత్వాసుపత్రిలో క్రిటికల్ కేర్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే కొన్ని అభివృద్ది పనులు పట్టాలెక్కలేదు. ప్రధానంగా సింగూరు కాలువల ఆధునీకరణకు నిధులు మంజూరైనప్పటికీ ఏడాదిగా పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలు శంకుస్థాపనలకే పరిమితమైంది. 2025 జిల్లాలో ప్రధాన అభివృద్ధి పనుల తీరుపై ఇయర్ రౌండప్ కథనం.
అభివృద్ది దిశగా అడుగులు పడ్డాయి
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే వినూత్నంగా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ బంక్‌ను స్వయం సహాయక సంఘాల మహిళలే స్వయంగా నిర్వహిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు విజయవంతంగా నిర్వహించారు. ఈ బంక్ ఏర్పాటు చేయడంతో తమకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని వాహనదారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ బంక్ నిర్వహణ నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అంతర్గతంగా విచారణ జరుగుతోంది.
రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్‌గా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా ఈ ఏడాది కీలక అడుగులు పడ్డాయి. ఉత్తర భాగం 161 కి.మీలు నిర్మిస్తున్న ఈ రోడ్డు నిర్మాణం కోసం ఉమ్మడి మెదక్ జిల్లా పరిఽధిలో సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ ఆర్డీఓ (కాలా)లు భూసేకరణ ప్రక్రియను చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 111 గ్రామాల పరిధిలో 6,250 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈ ప్రక్రియ పూర్తయితే నిర్మాణం పనులకు టెండరు ప్రక్రియ చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఒకటైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ఈ ఏడాది కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది. ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు ఈ పాఠశాలు మంజూరయ్యాయి. అయితే ఈ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపనలు ఈ ఏడాది జరిగినప్పటికీ.. నిధుల లేమి కారణంగా ఒక్క ఇటుక కూడా పడలేదు. నిర్మాణం పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఈ పాఠశాలల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుబాటులోకి వస్తుంది.
ముంబై హైవే విస్తరణలో భాగంగా చేపట్టిన బీహెచ్‌ఈఎల్– లింగంపల్లి చౌరస్తా వంద నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది. దీంతో పటాన్‌చెరు వైపు నుంచి చందానగర్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకముందు ఈ చౌరస్తాలో నాలుగు వైపుల కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం అయ్యేది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే వారు.
● మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోఅందుబాటులోకి ‘క్రిటికల్ కే


