రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ

Dec 28 2025 12:49 PM | Updated on Dec 28 2025 12:49 PM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ

ఝరాసంగం(జహీరాబాద్‌): ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కరాటే పోటీలో ఝరాసంగం మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టెనావతి శనివారం తెలిపారు. పోటీలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు పాల్గొనగా స్నేహ రెడ్డి ద్వితీయ స్థానం సాధించారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

నిధులు కేటాయించండి

వక్ఫ్‌బోర్డు చైర్మన్‌కు ఎమ్మెల్యే వినతి

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పట్టణంలో ముస్లింల సంక్షేమం కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఖేడ్‌ మైనార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని వక్ఫ్‌ భూమిలో ఉన్న షాదీఖానాకు రూ.50లక్షలు, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి మరో రూ.50లక్షలు, ఈద్గా కోసం 5 ఎకరాలు, ముస్లిం శ్మశానవాటిక కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. కాగా, చైర్మన్‌ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు తాహెర్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ దారం శంకర్‌, నాయకులు సంగన్న, పండరిరెడ్డి, మొయినొద్దీన్‌, మాజీద్‌, సుబుర్‌, అబిబుల్లా, హైదర్‌ నవాబ్‌, గౌస్‌ చిస్తి, ముకిత్‌, శాదుల్లా చిస్తీ, హఫీజ్‌ మదీనా, షఫీ ఖురేషి, మొయిన్‌ ఖురేషి, శకీబ్‌, అజీమ్‌, సల్మాన్‌ ఉన్నారు.

నేడు గాంధీ చిత్రపటాలతో నిరసనలు

జోగిపేట(అందోల్‌): పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఉన్న ఉపాధిహామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలతో నిరసన తెలియజేయాలని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఉద్యాన మిషన్‌ ద్వారా సబ్సిడీ

జిన్నారం (పటాన్‌చెరు): నీటి కుంట, జామ, టమాటా, నారు వంటి సాగుకు సంబంధించి ఉద్యాన మిషన్‌ కింద సబ్సిడీ కూడా ఇస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం గుమ్మడిదల పట్టణ కేంద్రానికి చెందిన కాసుశౌరి అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా నీటి కుంటతో సాగు చేస్తున్న కూరగాయలను పండించే పద్ధతులను రైతులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కూరగాయలతో పాటు జామ, ఆపిల్‌, బేర్‌ సాగు చేస్తున్న తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక రైతు కూరగాయలు, పండ్ల సాగు చేస్తున్న తీరును అభినందించారు. పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ డివిజన్‌ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జీవాలకు టీకాలు తప్పనిసరి

మనోహరాబాద్‌(తూప్రాన్‌): జీవాలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా రైతులు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య సంచాలకుడు వెంకటయ్య అన్నారు. శనివారం మ ండలంలోని కాళ్లకల్‌లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జీవాలకు మందుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు సర్పంచ్‌ నవ్య నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూప్రాన్‌ ఉమ్మడి మండల పశు వైద్యాధికారి లక్ష్మి, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌, సిబ్బంది రవి పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ1
1/1

రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement