క్రీడాకారులను ప్రోత్సహించాలి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్‌కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కే.రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్‌లో ఆర్‌కే ఫౌండేషన్ సహకారంతో అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. విన్నర్స్, రన్నర్, సెమీఫైనల్‌లో చోటు దక్కించుకున్న జట్టుకు నగదు బహుమతి అందజేశారు.


