సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
జిల్లాలో గత ఏడాది కంటే ఈసారి క్రైమ్ రేట్ తగ్గింది. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 8,344 కేసులు నమోదు కాగా, ప్రస్తుత సంవత్సరం 8,255 కేసులు నమోదయ్యాయి. ఇందులో సాధారణ కేసులు గత సంవత్సరంతో పోలిస్తే సమానంగా ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 28% తగ్గాయి. చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి–65పై సుమారు 80 మంది పోలీస్ సిబ్బందిని వివిధ బృందాలుగా విభజించి నాకాబందీ చేపట్టారు. – సంగారెడ్డి జోన్
జరిగిన పలు ఘటనలు
మునిపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రవి గ్రామంలో చిన్న గొడవ కావడంతో ఫిబ్రవరి 25న భార్య శోభ, తల్లి లక్ష్మితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుదేరా గ్రామ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మత్యువాత పడ్డారు.
ఆగస్టు 25న ఒడిశా నుంచి రెండు కార్లలో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా సంగారెడ్డి డీటీఎఫ్ టీమ్ పట్టుకుంది. ఒక కారులో 69.5 కేజీలు, మరో కారులో 53.3 కేజీల గంజాయిని కంది మండలంలోని చేర్యాల గ్రామ శివారులో పట్టుకున్నారు. నిందితులు అబ్దుల్ వహాబ్ సయ్యద్, ఉమాకాంత్ సబర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మరణాలు
గత సంవత్సరం కంటేఒక శాతం తగ్గిన క్రైమ్ రేటు
గతేడాది 8,344 ..
ఈసారి 8,255 కేసులు
పెరిగిన వాహన తనిఖీలు,డ్రంకెన్ డ్రైవ్‌లు
గతం కంటే పెరిగిన 11 గంజాయి కేసులు
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


