మద్యానికి బానిసై.. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దుబ్బాకరూరల్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రాజక్కపేట గ్రామంలో జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కీర్తి రాజ్ తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన తొగుట చంద్రయ్య(69) భార్యతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. వీరికి కూతురు, కుమారుడు కలరు. వీరికి వివాహాలు అయ్యాయి. కొంత కాలం నుంచి మద్యానికి బానిస కాగా అప్పుడప్పుడు మతి స్థిమితం లేకుండా ప్రవర్తించే వాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన చంద్రయ్య తిరిగి ఇంటికి రాలేదు. గ్రామ శివారులోని కాలువ ప్రక్కన గల రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడు. చుట్టు ప్రక్కల వారు గమనించి కుటుంబీకులకు, పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య లక్ష్మవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


