పిల్లల భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు
సదాశివపేట(సంగారెడ్డి): పిల్లల భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, చిన్న వయసు నుంచే సరైన అవగాహన కల్పిస్తే ప్రమాదాల నుంచి తగ్గించవచ్చని జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం బడి పిల్లల భద్రత, రక్షణ ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సురక్షితమైన, భద్రమైన పాఠశాల వాతావరణానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు కృషి చేయాలన్నారు. పిల్లలకు రహదారి భద్రత, ఇంటి వద్ద, అపరిచితుల నుంచి జాగ్రత్తలు, సైబర్, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల వంటి ముఖ్య అంశాలపై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ రత్నయ్య, ఓఎస్సీ అవగాహన అధికారి కల్పన, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాలవ్య, ఎస్‌ఐ.కృష్ణయ్య, హెచ్‌ఎం జయసుధ, సీఆర్పీలు, రాజేశ్వర్, సరస్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


