ఏడు వాహనాలు సీజ్
ములుగు(గజ్వేల్): నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు మార్గంలో వెళ్తున్న ఏడు వాహనాలపై పోలీసులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ములుగు ఎస్‌ఐ రఘుపతి వివరాల ప్రకారం... మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ యార్డుకు ప్రతినిత్యం కూరగాయలతో వచ్చే వాహనదారులు ఇష్టమొచ్చిన చోట వాహనాలను పార్కింగ్ చేయడం, తప్పుడు మార్గంలో మార్కెట్ యార్డుకు చేరుకుంటుండటంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయంలో పలుమార్లు కూరగాయల వాహనదారులకు సమావేశం నిర్వహించి సరైన మార్గంలో మార్కెట్‌కు రావాలని, ఇష్టమొచ్చిన చోట పార్కింగ్ చేయరాదని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా వాహనదారుల్లో మార్పు రాలేదు. శనివారం నింబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా పార్కింగ్ చేసి తప్పుడు మార్గంలో వస్తున్న 7 వాహనాలపై కేసునమోదు చేసి సీజ్ చేశారు.


