గ్రామ అభివృద్ధి కమిటీకి రూ.1.50లక్షల విరాళం
హుస్నాబాద్‌రూరల్: పల్లెను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ నిధుల కోసం చూడకుండా విరాళాల సేకరణకు నూతన పంచాయతీ ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం మండలంలోని గాంధీనగర్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని యువతకు అవగాహన కల్పించారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా సర్పంచ్ పోలు సంపత్, ప్రధాన కార్యదర్శిగా రాజ్‌కుమార్‌లతో పాటు పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామంలో ఎవరు మరణించినా వారి దహన సంస్కారాల కోసం రూ.5వేలు అందిస్తున్నారు. అభివృద్ధి కమిటీకి ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ఐలు డాక్టర్ రేణుక, కళ్యాణ్ రూ.1.50లక్షలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


