లోక్ అదాలత్‌తో కేసుల పరిష్కారం
ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: జాతీయ మెగా లోక్ అదాలత్‌లో సోమవారం 1044 కేసులు పరిష్కారమైనట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 56 కేసులలో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.45.41 లక్షలు తిరిగి బాధితులకు ఇప్పించామన్నారు. అనంతరం సామాజిక న్యాయ పోరాటం చేసిన వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
ప్రజల సమస్యల పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకుంటే నేరుగా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.


