బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల
సంగారెడ్డి: బీజేపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల ధ్వజమెత్తారు. ఆదివారం పనికి ఆహార పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించిన కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఆదివారం సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం మహాత్మాగాంధీ పేరును తొలగించాలానే కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటికై నా బీజేపీ ప్రభుత్వం చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, రవి, ప్రవీణ్, నర్సింహారెడ్డి, మహేష్, తాహిర్, రాజు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.


