డివైడర్‌ను ఢీకొట్టిన తుపాన్
పటాన్‌చెరు టౌన్: తుపాన్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కేరళ రాష్ట్రం నుంచి తుపాన్ వాహనంలో మధ్యప్రదేశ్‌కు 12 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. ముత్తంగి వద్ద ఓఆర్‌ఆర్‌పై మేడ్చల్ వైపు వెళుతుండగా సుల్తాన్‌పూర్ సమీపంలో అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని డ్రైవర్ నడపడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 12 మంది ప్రయాణిస్తుండగా, హనుమత్ సింగ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ మేరకు అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కుక్క అడ్డురావడంతో.. బైక్ అదుపుతప్పి..
కొమురవెల్లి(సిద్దిపేట): కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి హెడ్‌కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుజకుంట వాగు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చేర్యాల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ రోజు లాగే విధుల నిర్వహణ నిమిత్తం సిద్దిపేట నుంచి ద్విచక్రవాహనంపై స్టేషన్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో గురిజకుంట వాగు బ్రిడ్జి సమీపంలో అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో నరేందర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సులో చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటకు తరలించారు. ఇది ఇలా ఉంటే నరేందర్ హెల్మెట్ ధరించి ఉంటే తలకు బలమైన గాయం తగిలి ఉండేది కాదని స్థానికులు పేర్కొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
కొల్చారం(నర్సాపూర్): ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాలు ఇలా.. మెదక్ వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గ్రామంలోని భాస్కర్ రెడ్డి మూలమలుపు వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం ఒక్కసారిగా ట్రాక్టర్ డ్రైవర్ టాప్‌పై ఒరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ ఒక్కసారిగా కిందికి దూకాడు. దీంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బోల్తా పడి ఒకరికి తీవ్రగాయాలు


