పెళ్లి ఇష్టం లేదని..
పురుగుల మందు తాగి
యువతి ఆత్మహత్య
కొమురవెల్లి(సిద్దిపేట): పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని పోసాన్‌పల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ తోట మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పోసాన్‌పల్లి గ్రామానికి చెందిన కానుగంటి జ్యోతిరెడ్డి(24)కి కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తామన్నారు. దీంతో ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని శుక్రవారం క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్‌లు సీజ్
పాపన్నపేట(మెదక్): మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఎంకెపల్లి గ్రామానికి చెందిన బద్రి అంజయ్య, సలీం పాషా మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తుండగా పట్టుకొని, ట్రాక్టర్‌లను సీజ్ చేశామని చెప్పారు.


