ఆలయాల్లో పండుగ వాతావరణం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిలలో ప్రార్థనలు చేయనున్నారు. అందుకోసం జిల్లా కేంద్రంలోని ఉమాపార్థీశ్వర కోటిలింగాల ఆలయం, వెంకటేశ్వర, సంతోషిమాత, సాయిబాబా ఆలయాల్లో పూజలు, సీఎస్‌ఐ చర్చిలలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హిస్తారు. దీంతో నూతన సంవత్సరం రోజున ఆలయాలు, చర్చిల వద్ద విద్యుత్ కాంతులతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ మేరకు ఆలయం, చర్చిల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


