చివరి ఆయకట్టు వరకు సాగునీరు
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): నల్లవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి ఆదేశించారు. మంగళవారం నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌తో కలిసి యాసంగి పంటల కోసం సాగు నీటిని విడుదల చేశారు. అంతకుముందు గంగమ్మ పూజలు చేశారు. ప్రాజెక్టులో తెప్పోత్సవం నిర్వహించారు. జొన్న, మొక్కజొన్న, ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. సాగు నీటిని వాడుకునేందుకు సహకరించాలని కోరారు. నీటి సరఫరా చేసేందకు ఎప్పటికప్పుడు కాల్వల చుట్టూ తిరిగి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఈ ఎజాజ్ ఆహ్మద్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు పాటిల్ రవీందర్, గోవింద్‌నాయక్, నాయకులు కృఫ్ణమూర్తి, మోహన్‌రెడ్డి, జయరాజ్, బండారి సాయిలు, వీరచారి పాల్గొన్నారు.


