రెండో రోజు జన జాతరే
మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులు
మెదక్ కలెక్టరేట్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు రెండోరోజు ఘనంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మందితో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యువతీ, యువకులు సెల్ఫీలతో సందడి చేశారు.


