అమృత్ పనుల్లో వేగం పెంచండి
దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం రాధాకృష్ణన్
జహీరాబాద్: జహీరాబాద్ రైల్వేస్టేషన్‌లో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం రాధాకృష్ణన్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. బుధవారం స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల తీరుపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో మరింత వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పలు రైళ్లు జహీరాబాద్ స్టేషన్‌లో ఆగే విధంగా చూడాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్, జిల్లా నాయకుడు సుధీర్ భండారీలు డీఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు. బీదర్– కల్‌బుర్గి రైలును జహీరాబాద్ వరకు పొడగించాలని విన్నవించారు. పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఓఎం నరేంద్రవర్మ, స్టేషన్ మేనేజర్ మాధవకృష్ణ పాల్గొన్నారు.


