మత్స్యకారులకు తీరని అన్యాయం
హత్నూర(సంగారెడ్డి): మత్స్యకారులకు సమయానికి చేపపిల్లలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలోని హత్నూర శివారు పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే మత్స్యకారులకు సొంత డబ్బులు వెచ్చించి చేప పిల్లలు కొనుగోలు చేశారని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకం బంద్ చేసి యాదవులను మోసం చేశారన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టకుండా ప్రజలను మోసం చేస్తూ రెండేళ్లుగా కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులను విమర్శించడమే లక్ష్యంగా సీఎం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూదన్, సర్పంచ్‌లు ఎల్లయ్య, శోభారాణి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకరరావు, నాయకులు రవి, నరేందర్, మేరాజ్, రవీందర్ గౌడ్, వెంకటేశం, ఆంజనేయులు, భిక్షపతి, వీరేందర్, సత్యం, అధికారులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి


