బస్సు, టిప్పర్ ఢీకొని..
కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రమైన కందిలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.... మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పటాన్ చెరుకు వెళుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై కంది చౌరస్తాలో ముందు వెళుతున్న టిప్పర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు పదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.
రామాయంపేట పరిధిలో నలుగురికి...
రామాయంపేట(మెదక్): రామాయంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు...రామాయంపేటకు చెందిన విలేకరులు వెంకట్, రామారపు యాదగిరి బైక్‌పై నార్సింగి నుంచి రామాయంపేట వస్తుండగా, కేసీఆర్ కాలనీవద్ద జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వస్తున్న శంకాపూర్‌కు చెందిన వల్లూరి రాములు తన బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకట్, యాదగిరికి తీవ్రగాయాలయ్యాయి. మరో సంఘటనలో మండలంలోని తొనిగండ్లకు చెందిన పిట్ల పోచయ్య బైక్‌పై వెళ్తుండగా, అతి వేగంగా మెదక్‌వైపు వెళ్తున్న స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ పోచయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో సంఘటనలో పట్టణానికి చెందిన టంకరి స్వామి కాలినడకన వ్యవసాయ పనులకు వెళ్తుండగా, సిద్దిపేట వైపు కేటీఎం స్పోర్ట్స్’ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ స్వామిని ఆస్పత్రికి తరలించారు. ఈ మూడు కేసులకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
10 మందికి గాయాలు


