నడుచుకుంటూ వెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

నడుచుకుంటూ వెళ్తుండగా..

Dec 29 2025 10:52 AM | Updated on Dec 29 2025 10:52 AM

నడుచు

నడుచుకుంటూ వెళ్తుండగా..

బైక్‌ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

చేగుంట(తూప్రాన్‌): బైకు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వడియారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వడియారం గ్రామానికి చెందిన గుండ్ల సిద్ధిరాములు(59) వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్దిరాములు తలకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.

డివైడర్‌ను ఢీకొట్టి..

కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కంది శివారులోని మామిడిపల్లి చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్సై మధుసూదన్‌ రెడ్డి కథనం ప్రకారం... చౌటకూర్‌ మండలం వెండికోల్‌కు చెందిన చాకలి సాయిలు(50) ఆదివారం మామిడిపల్లిలోని బంధువుల ఇంటి వద్దకు వచ్చి తిరిగి బైక్‌ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మామిడిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని..

కంది(సంగారెడ్డి): గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్‌ ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్సై మధుసూదన్‌ రెడ్డి కథనం ప్రకారం... ఆదివారం శేరిలింగంపల్లికి చెందిన అజ్జు నాన్‌(25) తన స్నేహితుడైన జహీర్‌తో కలిసి బైకుపై కందిలో గల దాబాకు వస్తున్నారు. ఈ క్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ వద్ద వెనుక నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన అజ్జు నాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నడుచుకుంటూ వెళ్తుండగా.. 1
1/2

నడుచుకుంటూ వెళ్తుండగా..

నడుచుకుంటూ వెళ్తుండగా.. 2
2/2

నడుచుకుంటూ వెళ్తుండగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement