మార్పులకు అనుగుణంగా కులవృత్తులు
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి
సదాశివపేట(సంగారెడ్డి): చెరువుల్లో చేపపిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకే ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని చెరువులో 56 వేల చేపపిల్లలను మత్స్యకారులు, పార్టీ నాయకులతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తి మారాలని సూచించారు. ప్రభుత్వం బలహీన వర్గాలకు మరింత న్యాయం చేయాలని గతానికి మించి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, మత్స్యశాఖ ఏడీ సుదర్శన్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మకమిటి చైర్మన్ ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


