బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులు
కొల్చారం(నర్సాపూర్): జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన కరాటే పోటీల్లో మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బ్లాక్ బెల్ట్ సాధించారు. రిజుంకీ శోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే ప్రతిభా పోటీలు నిర్వహించారు. విద్యార్థులైన అక్ష య, నిహారిక, వైష్ణవి బ్లాక్ బెల్ట్, నిఖిల్ బ్రౌన్ బెల్ట్, మనోజ్ గ్రీన్ బెల్ట్ సాధించారు. చిన్నగనాపూర్ పాఠశాలకు చెందిన కీర్తి, భవాని బ్రౌన్ బెల్ట్, సంధ్య, ప్రణవి పర్పుల్ బెల్ట్ సాధించారు. వీరందరూ పైతర గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ మల్లేశ్ వద్ద శిక్షణ పొందుతున్నారు.


