పరిశ్రమలో డ్రగ్ అధికారుల దాడులు
పటాన్‌చెరు టౌన్: మెడిబ్లూ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమలో డ్రగ్ అధికారుల దాడులు నిర్వహించి, రూ. 1.70 లక్షల విలువైన ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ సంఘటన అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్క్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు పరిశ్రమలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరిశ్రమలో అనుమతి లేకుండా వైద్య పరికరాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు రూ.1.70 లక్షల విలువైన ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... వైద్య పరికరాల నిబంధనల ప్రకారం మెడికల్ డివైజెస్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ లైసెన్స్ కింద తయారు చేయాలన్నారు.అనుమతి లేకుండా వైద్య పరికరాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో బొల్లారం డ్రగ్ ఇన్‌న్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, జిన్నారం డ్రగ్ ఇన్‌న్‌స్పెక్టర్ శ్రీకాంత్, పాశమైలారం ఇనన్‌స్పెక్టర్ వరప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.1.70 లక్షల విలువైన ఉత్పత్తులు సీజ్


