పురిటి నొప్పులు అధికమవడంతో..
● వైద్యుల సూచన మేరకు
ఇంట్లోనే ప్రసవం
● అంబులెన్స్ సిబ్బంది చర్యలు
కొండపాక(గజ్వేల్): పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 అంబులెన్సు సిబ్బంది మహేందర్, రమేశ్ ఇంట్లోనే సుఖ ప్రసవమయ్యేలా చర్యలు చేపట్టగా ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ఈ ఘటన కొండపాకలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డెర కాలనీకి చెందిన లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వెళ్లగా పురిటినొప్పులు అధికమవ్వడంతో అంబులెన్సు కాల్ సెంటర్ వైద్యుడు శ్రీకాంత్ సూచనల మేరకు మహిళకు ప్రసవ మయ్యేలా వైద్యం చేశారు. ఇదివరకే లక్ష్మికి ఇద్దరు కూతుర్లుండగా ప్రస్తుతం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా తల్లీబిడ్డను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో సుఖ ప్రసవం అయ్యేలా కృషి చేసిన అంబులెన్సు సిబ్బందిని కుటుంబీకులు అభినందించారు.


