బాధ్యతగా తొలి అడుగు
తొలిరోజు గణిత
ల్యాబ్‌ను ప్రారంభించి..
గజ్వేల్‌రూరల్: సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. మండలంలోని బెజుగామకు చెందిన నక్కిర్త గోపాల్ సర్పంచ్‌గా గెలుపొందిన మరుసటి రోజు నుంచే గ్రామంలోని ఎస్సీ కాలనీలో బోరుమోటారుకు, ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు చేపట్టి అందరి మన్ననలు అందుకున్నారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్రామంలోని పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా గణితం ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
● పదవీ బాధ్యతలు చేపట్టిన
పంచాయతీ పాలకవర్గాలు
● అనంతరం
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
నూతనంగా గెలుపొందిన సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాల్లో నెలకొన్న పలుసమస్యలను పరిష్కరించారు.
పర్వతాపూర్‌లో శ్రమదానం..
రామాయంపేట(మెదక్): మండలంలోని పర్వతాపూర్‌లో సర్పంచ్ తార్యానాయక్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. చెత్తాచెదారాన్ని తొలగించిన అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. దంతేపల్లిలో సర్పంచ్ బాల్‌రాజు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం మొక్కలు నాటారు.
గుంతలు పూడ్చి.. ఇబ్బందులు తీర్చి
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని చౌటపల్లి గ్రామంలో సర్పంచ్ పత్తిపాక లావణ్య, పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని మర్రికుంట కట్టపై పడిన గుంతలను పూడ్చే పనులను మొదలు పెట్టారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తొలిరోజు గుంతలను పూడ్చేందుకు ఈ పనులను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో నూతన పాలకవర్గంతో పాటు తదితరులు ఉన్నారు.
పంచాయతీకి రూ.50 వేల విరాళం
మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి గ్రామాభివృద్ధికి తన వంతు సాయంగా సోమవారం రూ. 50 వేల చెక్కును సర్పంచ్ ఎలుముల మహేశ్వరికి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి, రాజేశ్, ఉప సర్పంచ్ కరుణాకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ భూమాగౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అన్నదమ్ములను
కలిపిన ఎన్నికలు
కల్హేర్(నారాయణఖేడ్): గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నదమ్ములను కలిపాయి. మండలంలోని మాసాన్‌పల్లికి చెందిన లింగంపల్లి బాగయ్య, లింగంపల్లి సాయిలు సోదరులు. కుటుంబ గొడవలు ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరాయి. ఇద్దరు ఏళ్ల తరబడి విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో లింగంపల్లి సాయిలు బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేశారు. దీంతో బాగయ్య, సాయిలు గొడవలు మరిచి ఎన్నికల్లో గెలుపు కోసం కలిసి పనిచేశారు. 12 ఓట్ల తేడాతో సాయిలు సర్పంచ్‌గా గెలిచారు. సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం అనంతరం బీఆర్‌ఎస్ నేతలు ఇద్దరిని సన్మానించారు. ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు సోదరులు కలిసిపోవడంతో గ్రామస్తులు అభినందించారు.
కార్మికులకు బీమా పత్రాలు అందజేస్తున్న సర్పంచ్ అనూష
మనోహరాబాద్(తూప్రాన్): ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. పంచాయతీ సిబ్బంది, కార్మికుల కృషితోనే పల్లెలు పరిశుభ్రంగా ఉండి ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారు. అలాంటి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తనవంతు సహాయం అందించేందుకు మనోహరాబాద్ నూతన సర్పంచ్ అనూష ముందుకొచ్చారు. సోమవారం నూతన పాలకవర్గం కొలువుదీరడంతో పదిమంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తన సొంత డబ్బులతో రూ.10 లక్షల చొప్పున జీవిత బీమా చేయించి అందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. దీంతో కార్మికులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
బాధ్యతగా తొలి అడుగు
బాధ్యతగా తొలి అడుగు
బాధ్యతగా తొలి అడుగు
బాధ్యతగా తొలి అడుగు
బాధ్యతగా తొలి అడుగు


