తాగునీటి సమస్యకు పరిష్కారం..
చిన్నశంకరంపేట(మెదక్): సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వెను వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించారు మండలంలోని కామారంతండా సర్పంచ్ మోహన్‌నాయక్. సోమవారం తండాలో నూతన పాలకవర్గం సభ్యులతో ప్రత్యేక అధికారి శ్యామ్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. కొంత కాలంగా మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయి తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న పంచాయతీ పరిధిలోని గోప్యాతండాలో బోరువేయించి బోరుమోటారును బిగించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బోరుమోటారు వద్ద పూజలు నిర్వహించి ప్రారంభించారు. తాగడానికి మంచినీరు పడటంతో తండావాసులు ఆనందం వ్యక్తం చేశారు.


