ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

Dec 23 2025 8:16 AM | Updated on Dec 23 2025 8:16 AM

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

చేగుంట(తూప్రాన్‌): ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు వస్తాయని , రైతులు సాగు చేయాలని లీవ్‌ పామ్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిప్యూటీ మేనేజర్‌ అశోక్‌ అన్నారు. సోమవారం మండలంలోని చిట్టోజిపల్లి గ్రామంలో ఆయిల్‌పామ్‌ మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ.. 40 మంది రైతులు ఆయిల్‌పామ్‌ సాగు కోసం ముందుకొచ్చారన్నారు. డ్రిప్‌ కోసం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సిద్దిరాములు, తార, ఫీల్డ్‌ ఆఫీసర్‌ సుజాత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement