నైపుణ్యతతోనే గుర్తింపు
గజ్వేల్‌రూరల్: విద్యార్థులు చదువుతో పాటు తమలోని నైపుణ్యాన్ని చాటినప్పుడే గుర్తింపు లభిస్తుందని గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనితా అబ్రహం పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్లేస్‌మెంట్ సెల్, టాస్క్ ఆధ్వర్యంలో మహేంద్ర ప్రైడ్ క్లాస్‌రూమ్ ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు, ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ ముగింపు సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లా డారు. ఉపాధి నైపుణ్య శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులకు సర్టిఫికెట్లను అందజేశారు. అదే విధంగా జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్, డాక్యుమెంటరీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


