పరిశోధనలపై కృత్రిమ మేధస్సు ప్రభావం
పటాన్‌చెరు టౌన్: విద్య, పరిశోధన రంగంలో కృత్రిమ మేధస్సు ప్రభావం అమితంగా ఉంటుందని రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ మల్లేశం అన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ మల్టీ డీసీప్లినరీ రీసెర్చ్‌పై జరుగుతున్న జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యా పరిశోధనలో కృత్రిమ మేధస్సు, సాంకేతికత చాలా ప్రభావం చూపుతోందన్నారు. పరిశోధకులకు కావలసిన భాష అనువాదం, ఉత్తర ప్రత్యుత్తరాలు, కంటెంట్‌ను సృష్టించడం, తెలివైన క్యూటరింగ్ సిస్టమ్స్ కావచ్చు ఇంకా అనేక రంగాలపై ఏఐ ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమం కళాశాల అధ్యాపకులు డాక్టర్ పూనం, డాక్టర్ మల్లిక, డాక్టర్ బి.సుజాత, డాక్టర్ మంజు, డాక్టర్ ఆర్ శివదీప్తి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ షరీఫ్, విద్యార్థులు లెక్చరర్లు , పరిశోధకులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ మల్లేశం


