ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్
హవేళిఘణాపూర్(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బూర్గుపల్లి గ్రామానికి చెందిన దాసరి సుమన్(25), గుండు బాలవర్థి(22), అర్కెల కుమార్ బైక్‌పై బూర్గుపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో శాలిపేట మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఎల్లారెడ్డి వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కిందపడిపోయిన సుమన్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన గుండు బాలవర్థిని మెదక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వీరితో పాటు ఉన్న అర్కెల కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా ఆయనను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ నరేశ్ చేరుకొని మృతదేహాలను మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మరో ప్రమాదంలో నలుగురికి గాయాలు..
హవేళిఘణాపూర్(మెదక్): రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఫరీద్‌పూర్ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ముత్తాయిపల్లి గ్రామానికి చెందిన ఎండి.శైలాన్ సర్దన వైపు నుంచి ఎక్స్‌ఎల్ వాహనంపై తన పిల్లలను తీసుకొని స్వగ్రామం ముత్తాయిపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఫరీద్‌పూర్ శివారులోకి రాగానే సర్ధన గ్రామానికి చెందిన రమేశ్ బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు. దీంతో రమేశ్‌కు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శైలాన్‌తో పాటు ఉన్న ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు కాగా మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు దెబ్బలు తగలడంతో బోరున విలపించారు.
ఇద్దరు మృతి.. మరొకరికి గాయాలు
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్


