పాముకాటుతో యువతి మృతి
చేగుంట(తూప్రాన్): పాము కాటుతో యువతి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గంగాధర్ స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కూతురు అక్షయ(16) శనివారం రాత్రి పాముకాటుకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆదివారం స్థానికులు ఆమె పాముకాటుకు గురైనట్లు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్రంలో ఉండగానే ఆమె మృతి చెందింది.
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో..
నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో శనివారం రాత్రి జరిగింది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... హవేళిఘణాపూర్‌కు చెందిన దండు శ్రీకాంత్ (33) కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో నివాసం ఉంటున్నాడు. కాగా మోటార్ వైండింగ్ మెకానిక్‌గా నర్సాపూర్‌లో పనిచేస్తున్నాడు శనివారం సాయంత్రం నర్సాపూర్‌లో పనులు ముగించుకుని బైక్‌పై తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెదక్ నుంచి అతివేగంగా వస్తున్న ఆర్టీసీ డిపో బస్సు నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిపై చిన్న చింతకుంట మూలమలుపు వద్ద అతడ్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు కాగా నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య మంజుల, ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ..
చేగుంట(తూప్రాన్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రం చేగుంటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... చేగుంటకు చెందిన ఎల్ది శ్రీనివాస్(50) కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 10న రాత్రి ఇంట్లో యాసిడ్ తాగి అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పాముకాటుతో యువతి మృతి
పాముకాటుతో యువతి మృతి


