జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో పారాక్వా ట్, దాని ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి బుధవారం తెలిపారు. పారాక్వాట్ వాడకం వల్ల సమస్త జీవరాశికి ప్రతికూల ప్రభావాలు కలుగుతున్న ట్లు, రైతుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ మందు ఉత్పత్తుల విక్రయాలు, తయారీ, వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ నిషేధం 60 రోజుల పాటు ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రైతులు సేంద్రియ
వ్యవసాయం చేయాలి
కేవీకే ఉద్యానవన శాస్త్రవేత్త శ్రీనివాస్
చిలప్‌చెడ్(నర్సాపూర్): రైతులు తప్పనిసరిగా సేంద్రియ వ్యవసాయం చేయాలని కేవీకే తునికి ఉద్యానవన శాస్త్రవేత్త శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన వ్యవసాయాధికారి రాజశేఖర్‌గౌడ్‌తో కలిసి మండల పరిధిలోని గంగారంలో రైతులకు భూమి సుపోషణ, భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి కోతల తర్వాత వరి కొయ్యలను కాల్చితే భూసారం తగ్గడంతో పాటు, సూక్ష్మజీవులు చనిపోతాయన్నారు. వరికొయ్యలను నేలలో కలియబెట్టి దున్నాలన్నారు. జనుము, జీలుగ విత్తనాలను భూమిలో వెదజల్లి, 50 శాతం పూత దశకు రాగానే నేలలో కలియబెట్టాలని తెలిపారు. తద్వారా 20 టన్నుల సేంద్రియ ఎరువు తయారవడంతో పాటు, సేంద్రియ కార్బనం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుధీర్‌రెడ్డి, ఏఈఓ కృష్ణవేణి, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.
జింకపై కుక్కల దాడి
చికిత్స చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగింత
అల్లాదుర్గం(మెదక్): దారి తప్పి గ్రామంలోకి వచ్చిన జింకపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పిన జింక పిల్ల వెంకట్‌రావ్‌పేట గ్రామంలోకి వచ్చింది. జింకను చూసిన కుక్కలు వెంటపడి దాడి చేశాయి. గ్రామస్తులు గమనించి జింక పిల్లను పట్టుకున్నారు. పశువైద్యాధికారికి సమాచారం ఇచ్చి చికిత్స చేయించారు. అనంతరం జింకను ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు గ్రామస్తులు చెప్పారు.
ఇసుక అక్రమ డంప్ సీజ్
చిన్నశంకరంపేట(మెదక్): అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌ను అధికారులు సీజ్ చేశారు. బుధవారం నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఆర్‌ఐ మేఘనగౌడ్ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన 18 ట్రాక్టర్ల ఇసుకను గుర్తించి సీజ్‌చేశారు. ఈ ఇసుకను ఈ నెల 2న మధ్యా హ్నం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గ్రేసిబాయి తెలిపారు. ఇసుక వేలంలో పాల్గొనాలనుకునే వారు గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.


