చైర్మన్ గిరి.. నేతల గురి
1953లో తొలి మున్సిపాలిటీగా
జిల్లాలో ఆవిర్భావం
చైర్మన్లుగా కాంగ్రెస్ వారే అధికం
ఈ సారి ఎవరిని వరిస్తుందోనని చర్చలు
సదాశివపేట(సంగారెడ్డి): ప్రముఖ వ్యాపార కేంద్రమైన సదాశివపేట పట్టణానికి 73 ఏళ్ల చరిత్ర ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1953లో తొలి మున్సిపాలిటీగా 15 వార్డులతో ఏర్పాటైంది. ఈ మున్సిపాలిటీ ప్రస్తుతం 26 వార్డులకు పెరిగింది. మున్సిపాలిటీలో సిద్ధాపూర్ గ్రామ పంచాయతీని విలీనం చేశారు. ప్రస్తుతం 36,982 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 18,151, మహిళలు 18,829, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్లుగా పలువురు పనిచేశారు. కొందరికి అనూహ్యంగా దక్కగా మరికొందరికి నాయకుల అండదండలతో చైర్మన్ పదవి వరించింది. మహిళలకు మాత్రం మూడు సార్లు అవకాశం దక్కింది. సదాశివపేట మున్సిపల్ చైర్మన్లుగా 14 మంది పనిచేయగా ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 8 పర్యాయాలు చైర్మన్లుగా కొనసాగారు. టీడీపీ నుంచి రెండు సార్లు అధికారం చేజిక్కించుకోగా, కాంగ్రెస్, బీజేపీ బలపర్చడంతో ఒక్కసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థి కొత్తగొల్ల అనురాధ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని పట్నం విజయలక్ష్మిని వరించింది. జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రం చైర్మన్ పదవిని దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అన్ని పార్టీల మహిళలకు చైర్మన్ పదవిపై ఆసక్తి పెరిగింది. ఈ సారి చైర్మన్‌గిరి ఎవరిని వరిస్తుందోనని చర్చలు జరుగుతున్నాయి.
సదాశివపేటకు
73 ఏళ్ల చరిత్ర
మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన వారు వీరే..


