●పొలం బడి.. రైతులకు రాబడి
చిలప్‌చెడ్(నర్సాపూర్): వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే పొలం బడి ముఖ్య ఉద్దేశమని, సస్యరక్షణ కేంద్రం సహాయక మొక్కల సంరక్షణ అధికారి ఉదయ్‌శంకర్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని రైతువేదికలో పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలం బడి రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించి, ఉత్పత్తిని పెంచుతుందన్నారు. సస్యరక్షణ పద్ధతులైన లోతు దుక్కులు, ఎర పంటలు, మిత్ర పురుగులు, లింగాకర్షక బుట్టలు, తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం సస్యరక్షణ కేంద్రం అధికారి బసవన్నప్ప విత్తన శుద్ధిని డెమో చేసి చూపించారు. వ్యవసాయాధికారి రాజశేఖర్‌గౌడ్, ఏఈఓ అనిత, సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, అనిల్, ధర్మారెడ్డి పాల్గొన్నారు.
సస్యరక్షణ కేంద్రం సహాయక అధికారి


