సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి
హంిపీ పీఠాధిపతులు
శివ్వంపేట(నర్సాపూర్): సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిమార్గాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షంచడంలో కృషి చేయాలని హంిపీ పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామీజీ అన్నారు. హైందవ సంస్కృతి, సనాతన ధర్మం పరిరక్షణకు మంగళవారం మండలంలోని గోమారం పురాతన శివాలయం, పెద్దగొట్టిముక్లలోని ప్రాచీన ఉమా సంఘమేశ్వర స్వామిని దర్శించుకొని శతరుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను పరిరక్షిస్తూ గోమాత సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు శాస్త్రుల అమోధ్య రామశర్మ, భక్తులు పాల్గొన్నారు.


