ఎన్నికల నియమావళి పాటించాలి
సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణకు, ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీ కార్యాలయం నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలన్నారు.


