గంజాయి స్వాధీనం
మునిపల్లి(అందోల్): గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ శంకర్ వివరాల ప్రకారం... మంగళవారం బీదర్ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ యాకూబ్ గంజాయిని తరలిస్తుండగా కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో పట్టుకున్నారు. ఎండు గంజాయి, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎకై ్సజ్ అధికారులు అనుదీప్, హనుమంతు, అరుణజ్యోతి, అంజిరెడ్డి, సాయి, శివకాంత్, రాజేశ్, కృష్ణ పాల్గొన్నారు.
కోహెడరూరల్(హుస్నాబాద్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న బోలెరో వాహనాన్ని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ అభిలాష్ వివరాల ప్రకారం... మండలంలోని వింజపల్లి గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. గ్రామంలోకి వస్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో అక్రమంగా లోడ్ చేసిన ఇసుక లభ్యమైంది. దీంతో వాహన డ్రైవర్ గీకురు రమేశ్‌పై కేసు నమోదు చేసి, వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని చిలాపూర్‌పల్లె శివారులోని వడ్డెర కాలనీకి చెందిన గౌరవ్వ, మల్లేశ్వరి నాటుసారా తయారు చేస్తుండటంతో ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తహసీల్దార్ శ్రీకాంత్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. మరోసారి తయారు చేస్తే లక్ష రూపాయల జరిమాన గాని ఏడాది జైలు శిక్ష గాని విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎకై ్సజ్ సీఐ, పవన్, ఎస్‌ఐ దామోదర్, ట్రైనీ ఎస్‌ఐ మధుసూదన్ పాల్గొన్నారు.
వట్‌పల్లి(అందోల్): యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలకేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ లవకుమార్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన డమ్ము వెంకటేశ్ (31) జనవరి 31న తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేదు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమాన విధించింది. టూటౌన్ సీఐ ఉపేందర్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ 11 మంది పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,16,500 జరిమాన విధించారు.
పటాన్‌చెరులో 14 మందికి..
పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమాన విధించింది. పటాన్‌న్‌చెరు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ వివరాల ప్రకారం... సోమవారం పట్టణంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 14 మందిని పట్టుకుకున్నారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరు పర్చగా, 10 మందికి రూ.వెయ్యి, నలుగురికి రూ.1500 జరిమాన విధించినట్లు పేర్కొన్నారు.
గంజాయి స్వాధీనం
గంజాయి స్వాధీనం


