స్వేచ్ఛగా ఓటేయండి: డీఎస్పీ | - | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛగా ఓటేయండి: డీఎస్పీ

Feb 10 2026 9:49 AM | Updated on Feb 10 2026 9:49 AM

స్వేచ్ఛగా ఓటేయండి: డీఎస్పీ

స్వేచ్ఛగా ఓటేయండి: డీఎస్పీ

పట్టణంలో పోలీసుల కవాతు

సంగారెడ్డి క్రైమ్‌: ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సోమవారం డీఎస్పీ ఆధ్యర్యంలో 5 మంది సీఐలు, 10 మంది ఎస్సైలు, 100 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లతో కలిసి పట్టణంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి శివాజీనగర్‌, నాల్‌సాబ్‌గడ్డ, శాంతినగర్‌, కొత్త బస్టాండ్‌, ఐబీ వరకు కవాతు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్‌ ప్రజలు, స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పట్ట ణంలో ఎన్నికలకు ఆటంకం కల్గించిన , ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రామునాయుడు, ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement