ఖేడ్‌లో కాంగ్రెస్ దౌడ్
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లింది. మొత్తం 15 వార్డుల్లో 11 వార్డులను ఆ పార్టీ కై వసం చేసుకుంది. 2020లో ఖేడ్ మున్సిపాలిటీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో 15 వార్డులకు గాను నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 8 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో బీఆర్‌ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందాక బీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నారు. ఖేడ్‌లో జోష్‌తో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నాయి. గెలుపొందిన 11 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో బస్సులో క్యాంపునకు తరలివెళ్లారు. గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు కౌంటింగ్ కేంద్రంనుంచి వాహనాల్లో నేరుగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. వారిని ఎమ్మెల్యే సన్మానించారు.


